Monday, December 23, 2024

గేదెల మృతికి నష్టపరిహారం కోరుతూ గ్రామస్తుల రాస్తారోకో

- Advertisement -
- Advertisement -

మంథని: మండలంలోని రచ్చపల్లి గ్రామానికి చెందిన సింగనవేని లింగేష్ అనే రైతుకు చెందిన ఆరు గేదెలు మంథని మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన గురుకుల కళాశాల ముందు ఇసుక లారీ ఢీకొట్టగా అందులో నాలుగు చనిపోగా, మరో రెండు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి సీపీఎం నాయకులు, కాంగ్రెస్ కిసాన్ సెల్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రహదారిపై రైతుకు నష్టపరిహారం చెల్లించాలని రాస్తారోకో చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంథనిలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, ఇసుక లారీల డ్రైవర్లు మద్యం మత్తులో అధిక లోడుతో అతివేగంగా వెళ్లుతున్నారని తెలిపారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. బాధిత కుటుంబం వాటిపై జీవనాధారంతో ఉండగా, ఇప్పుడు వారిని ఎవరూ ఆదుకుంటారని ప్రశ్నించారు. మూగజీవాల చావుకు కారణమైన లారీ డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, బాధితునికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్, సీపీఎం నాయకులు ఆర్ల సందీప్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు కిరణ్, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News