యాదాద్రి భువనగిరి : చట్టం ఎవరికి చుట్టం కాదని నేరారోపణ రుజువైనప్పుడు కచ్చితం గా శిక్ష తప్పదని జిల్లా న్యాయమూర్తి మారుతి దేవి తీర్పుతో రుజువైంది. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల పరిధిలోని చల్లూర్ గ్రామంలో సంచలనం రేకెత్తించిన కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి మారుతి దేవి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. 2020వ సంవత్సరంలో రాజపేట మండలం చల్లూర్ గ్రామంలో నివసించే చేట్కూరి అయిలయ్య తండ్రి నర్సయ్య, ఇంటి జాగ విషయంలో చేట్కూరి అయిలయ్య, మల్లయ్య, చేట్కూరి కుమార్, నర్సయ్య, యాదగిరి, స్వామి, అరుణ, లక్ష్మి, లక్ష్మి అయిలయ్యలు మరో వ్యక్తి అయిలయ్యను ఇంటి జాగ పంచాయతీ విషయ ంలో బాగ కొట్టి హత్యచేసిన్నట్లు తెలిపారు.
అప్పటి సీఐ నర్సయ్య కేసు నమోదు చేసి ద ర్యా ప్తు ప్రారంభించారని అప్పటినుండి కోర్టులో -టైల్ రాన్ నడుస్తుందన్నారు. ఈ ఘటనపై అప్పట్లో 08 మందిపై కేసులు నమోదు చేయగా 08 మందిని నిందితులుగా తేలుతూ కోర్టు శిక్ష వెలువరించిందన్నారు. నేరస్తులకి శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. కేసులో నేరస్తులను అదుపులోకి తీసుకొని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర పర్యవేక్షణ లో యాదగిరిగుట్ట ఏసిపి నరసింహరెడ్డి, సీఐ సురేందర్ రెడ్డి సూచనలతో రా జపేట ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి సిబ్బంది సహాయంతో సాక్షుల ద్వారా సరైన పద్ధతిలో నిర్భయంగా సాక్ష్యం చెప్పే విధంగా తర్ఫీదు ఇచ్చి సరైన సమయ ంలో కోర్టుకు హాజరు పరిచి న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించగా యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయమూర్తి మారుతి దేవి మొత్తం ఎనిమిది మ ందిని నిందితులుగా తేల్చి శిక్ష విధించారని చెప్పారు. కేసు ఫైనల్ జడ్జిమెంట్‌కు రావడానికి కృషి చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర, ఏసిపి నరసింహరెడ్డి, యాదగిరిగుట్ట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి,రాజపేట ఎ స్‌ఐ సుధాకర్ రెడ్డి, పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని ఈసందర్భంగా పలువురు అభినందించారు.