- Advertisement -
హైదరాబాద్ : స్వతంత్య్ర సమరయోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, కేంద్ర పర్యాటక సాంస్కృతికశాఖల మంత్రి కిషన్ రెడ్డిలు ముఖ్య అతిథిలు గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, సినిమా నటులు మురళీ మోహన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్షత్రీయ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -