- రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,
సీనియర్ సివిల్ జడ్జి డి. ఇందిర
ఆమనగల్లు: గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత న్యాయ సేవ సలహాలను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి. ఇందిర సూచించారు. ఆమనగల్లు పట్టణంలోని రైతువేదిక భవనంలో శుక్రవారం రంగారెడ్డి కోర్టు న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో ఉచిత న్యాయ సలహాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర మాట్లాడుతూ న్యాయం అందరికి సమానమేనని ధనిక, పేద, కుల, మతం అనే తేడాలు లేవని తెలిపారు. న్యాయ సేవాధికార చట్టం రైతులకు, పేదలకు, బాలలకు, మహిళలకు కల్పిస్తున్న ఉచిత న్యాయ సలహాను వినియోగించుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తినచో వాటిని ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆమె సూచించారు. ఈ సందర్భంగా రైతుల నుండి 10 ధరఖాస్తులను న్యాయమూర్తి స్వీకరించారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి గీతారెడ్డి, మహేశ్వరం ఏడీఏ సుజాత, ఏవో అరుణకుమారి, తహసిల్దారు జ్యోతి, ఎంపీడీవో ఫారూక్ హుస్సేన్, మార్కెట్ కార్యదర్శి సరోజ, ఎసై సుందరయ్య, జెడ్పిటిసి అనురాధ పత్యనాయక్, ఏఈవోలు రాణి, నిఖిత, శివతేజ, సాయిరాం, తదితరులున్నారు.