- Advertisement -
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కోరిన ప్రభుత్వ విప్
హైదరాబాద్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు మెడికల్ కళాశాల ను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం మంత్రుల నివాసంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే యాదగిరిగుట్టకు 100 పడకల ఆస్పత్రి మంజూరు అయిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా మెడికల్ కలశాలను ఏర్పాటు చేయాలని కోరారు. స్వామి వారి దర్శించుకునేందుకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి పోయిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ విప్ తెలిపారు.
- Advertisement -