- ఎబివిపి రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ రంజిత్
ఆమనగల్లు: ఆమనగల్లు మండల కేంద్రంలో బీసీ హాస్టల్ భవనం నిర్మిం చాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ రంజిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమ నగల్లు మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను సరూర్‌నగర్‌కు తరలించడంలో బీసీ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని తెలిపారు.
ఆమనగల్లు మండల కేంద్రంలో స్థానిక ఏబీవీపి నాయకు లతో కలిసి రంజిత్ విలేకరులతో మాట్లాడారు. 4 మండలాలకు ప్రధాన కూడలి అయిన ఆమనగల్లు మండల కేంద్రంలో వసతి గృహంలో సుమారు 600 మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ఈ విషయం పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ దృష్టి సారించి, భవనం ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2018 ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కెసీఆర్ ఆమనగల్లులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నేరవేర్చాలని కోరారు.
ఆమనగల్లుకు చెందిన గురుకుల పాఠశాల షాబాద్‌లో కాకుండా ఆమనగల్లు మండల కేంద్రంలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, పాఠశాలను వెంటనే మరమ్మత్తులు చేయాలని కోరారు. సమా వేశంలో ఏబీవీపీ నాయకులు గోరేటి భరత్, కృష్ణగౌడ్, లండం మల్లేష్, నరేష్‌గౌడ్, తరుణ్‌నా యక్, సుమన్‌నాయక్, శంకర్, మల్లేష్, భద్రూనాయక్, రాము, జగ్గుసింగ్ తదితరులున్నారు.