Tuesday, December 24, 2024

దేశ వ్యాప్తంగా ఉపా చట్టాన్ని రద్దు చేయాలి : ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ ః దేశ వ్యాప్తంగా నమోదు అయిన 25 వేల ఉపా కేసులలో 2 శాతం కేసుల్లో కూడా శిక్షలు పడలేదని, నేరం నిరూపణ కాకున్నా వేలాధి మంది జైళ్ల ల్లో మగ్గుతున్నారని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దేశ సమగ్రతను కాపాడేం దుకే పాలకులు చట్టాలు చేయాల్సి ఉండగా, ప్రజల పక్షాన ప్రశ్నించేవారిపై ఉపా చట్టం ప్రయోగించడం అప్రజాస్వామికం అని ద్వజమెత్తారు. తాడ్వా యి కుట్ర కేసులో పిఓడబ్లూ జాతీయ కన్వీనర్ వి.సంధ్యతో సహా అక్రమంగా మోపిన వారందరిపై ఉపా కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.

ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్థన్ అధ్యక్షత వహించగా, సహాయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపి మల్లు రవి, తెలం గాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరామ్, సీపిఐ రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేష్, పౌరహక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్, పిఓ డబ్లూ జాతీయ కన్వీనర్ సంధ్య ప్రసంగించారు. డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేవలం వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై మాత్రమే కాకుండా, బిఎస్‌పి కార్యకర్తలపై కూడా ఉపా కేసులు నమోదు చేశారన్నారు. ఉపా చట్టం తెలంగాణ ప్రజల అస్తిత్వ, హక్కుల సమస్య గా మారబోతోందని అన్నారు.

ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపి మల్లు రవి మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులకై పోరాడే వాళ్లపై ఉపా కేసులు నమోదు చేయడం సరైంది కాదన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. పాఠ్య పుస్తకాలలో తొలగించిన సెక్యూలరిజం, సోషలిజం అనే పదాలను తిరిగి చేర్చాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపా చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, నగర నాయకురాలు అనురాధ, పిడిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పరుశురాం, పిఓడబ్లూ రాష్ట్ర కోశాధికారి సరళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News