Saturday, November 23, 2024

అభివృద్ధిని చూసే బిఆర్‌ఎస్‌లోకి చేరికలు

- Advertisement -
- Advertisement -

దుగ్గొండి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్‌ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వంగేటి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో దుగ్గొండి మండలంలోని మహ్మదాపురం, మర్రిపల్లి, నాచినపల్లి, మందపల్లి, దుగ్గొండి, దేశాయిపల్లి, రేబల్లె, మైసంపల్లి, చలపర్తి గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు బిజెపి మండల యూత్ అధ్యక్షుడు, కాంగ్రెస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు గులాబి తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో ప్రజలు తలెత్తుకునేలా చేశానని, గత పాలకుల కంటే మెరుగ్గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. మరోసారి గెలుపు గులాబీ పార్టీదేనని, సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రజా సమస్యల నుంచి పారిపోయిన వారికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శిరస్సు వంచి 24 గంటలు బాద్యతగా పనిచేస్తున్నారన్నారు.

నియోజకవర్గ ప్రజల 70 ఏళ్ల సాగునీటి కలను నిజం చేసిన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీదేన్నారు. ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశంతో చరిత్రలో నిలబడే అభివృద్ధిని చేసి చూపించా. రాజకీయాలకతీతంగా నిత్యం ప్రజా సంక్షేమంలో, రైతు సేవలో ఉంటున్నారన్నారు. ప్రతిపక్షాలది ఓట్ల రాజకీయమని, నాది అభివృద్ధి సంక్షేమ రాజకీయమని ప్రజలు ఆలోచించాలన్నారు. విజన్, విలువలు లేని వారితో అభివృద్ధి జరగదు. రాజకీయ చైతన్యం ఉన్న నర్సంపేట ప్రజలు పగటి వేషగాళ్లను నమ్మరన్నారు.

విద్య, వైద్యం, సంక్షేమం, సాగునీటి రంగంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలపా. నాకు రాజకీయంగా అండగా ఉన్న నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధితో రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, ఎంపీపీ కోమల, క్లస్టర్ బాధ్యులు, ఎంపీటీసీలు, సొసైటీ ఛైర్మన్లు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News