కామారెడ్డి టౌన్ : న్యాయ వ్యవస్థలో నిరుపేదలకు న్యాయ సహాయం అందించడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం కార్యాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్ పర్సన్, జిల్లా జడ్జి ఎస్ ఎన్ శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టులో జిల్లా న్యాయ పేవ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం కార్యాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనుభవజ్ఞులైన న్యాయవాదుల ద్వారా పేదలకు సకాలంలో న్యాయ సహాయం అందుతుందని తెలిపారు.
న్యాయం కోరే నిరుపేదలకు నవీకరణకు దారి తీసే మెరుగైన ప్రతిస్పందన, కేసుల పురోగతి ఉంటుందని చెప్పారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా బి.రమేష్ చందు, కే.మోహన్ రావు,పల్లె చిరంజీవి నియమితులయ్యారు. కార్యక్ర మంలో జూనియర్ సివిల్ జడ్జి టి.భార్గవి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, సబ్ జైల్ సూపరింటెండ్ శ్రీధర్, బార్ అసోసియేషన్ ప్ర తినిధులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పర్యవేక్షకులు చంద్రసేనా రెడ్డి, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.