Tuesday, December 24, 2024

దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ల అందజేత

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: ఐసీడీఎస్ నర్సంపేట ప్రాజెక్టు పరిధిలో వెన్నెముక వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న వారికి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. కాగా మండలంలోని దుగ్గొండి మండలం తొగర్రాయి నుంచి బండి రాజయ్య, నెక్కొండ మండలం నాగారానికి చెందిన నీరెల్లి రాములు, నర్సంపేటకు చెందిన రాజ్‌కుమార్,

నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన కందకట్ల నవీన్‌లకు బ్యాటరీ ట్రై సైకిళ్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ విద్య, జూనియర్ అసిస్టెంటు రమాదేవి, నల్ల భారతి, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, గోనె యువరాజు, సూపర్‌వైజర్లు శ్రీదేవి, ఝాన్సీ, వాసంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News