Tuesday, December 24, 2024

ఆదాయ అభివృద్ది సాదించడంలో మహిళలు ముందంజలో ఉండాలి.

- Advertisement -
- Advertisement -

రాజంపేట్: ఆదాయ అభివృద్ధ్ది సాధించడంలో మహిళలు ముందంజలో ఉండి జీవనోపాధితో పాటు అభివృద్దికి బాటలు వేసుకోని మహిళలు ఆర్థికంగా ఏదగాలని రాజంపేట్ గ్రామ సర్పంచ్ సౌమ్య నాగరాజు అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో 3 లక్షల రూపాయల స్త్రీ నిధి రుణాలతో రాజంపేట్ సంద్య గ్రామ సంఘం, పద్మ సంఘం సభ్యురాలు పిట్ల పద్మ స్వామి సభ్యురాలు పెద్దమ్మ చేపల పెంపకం యూనిట్‌ను సర్పంచ్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ సౌమ్య నాగరాజు మాట్లాడుతూ… కుటుంబ ఆదాయ అభివృద్ధ్దిలో భాగంగా జీవనోపాధి అభివృద్ది చేసుకోవడానికి ఐకేపీ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాను ఎంచుకోని అందులో రాజంపేట్ మండలంలో చేపల పెంపకంకు మహిళలను ప్రోత్సహించడం సంతృప్తికరం అని పేర్కోన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరువతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అని అన్నారు.

చేపలలో మంచి మిటామిన్లు ఉంటాయని చికెన్, మటన్ కంటే అధిక పోషకాలు చేపలలో ఉంటాయని రానున్న రోజులలో విందులలో చేపలతో కూడిన వంటకాలు రానున్నాయని అన్నారు. ఇలాంటి పథకాలు మహిళలకు ఎంతో ఉపయోగపడుతాయని తక్కువ ఆదాయంతో ఎక్కువ లాభాం పోందే మార్గం చేపల పెంపకం అని అన్నారు. ఇలాంటి మంచి యునిట్లను మహిళలు ఆర్థికంగా ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిపిఎం రమేష్ బాబు, ఎపియం సాయిలు సోసైటి చైర్మెన్ నల్లవెళ్ళి అశోక్, వైస్ చైర్మెన్ ఆంద్యాల రమేష్, సిసిలు శ్రీనివాస్, బాగయ్య, సాయిలు, స్వామి, మండల మహిళ సంఘం అద్యక్షురాలు లక్ష్మి, సోసైటీ డైరెక్టర్ సాయిబాబా పటేల్, సిద్దిరాములు, గ్రామాల విఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News