Saturday, December 21, 2024

జాబ్‌కు లంచం.. నలుగురు అధికారులపై టిసిఎస్ వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశంలోని అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) లంచం తీసుకున్నందుకు నలుగురు అధికారులను కంపెనీ నుంచి తొలగించింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ అధికారులు ఉద్యోగాలు ఇవ్వడానికి సిబ్బంది సంస్థల నుంచి కమీషన్ తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా కంపెనీలో ఇదే జరుగుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో టిసిఎస్ వెంటనే చర్య తీసుకుంది.

రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్(ఆర్‌ఎంజి) నుండి 4 సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించింది. గ్లోబల్ హెడ్ ఇఎస్ చక్రవర్తిని కూడా సెలవుపై పంపారు. కంపెనీ 3 సిబ్బంది సంస్థలను బ్లాక్ లిస్ట్ చేసింది. ఈ సిబ్బంది సంస్థలు, తొలగించబడిన అధికారుల పేర్లు ఇంకా వెల్లడించలేదు. ఆర్‌ఎంజి గ్లోబల్ హెడ్ ఇఎస్ చక్రవర్తి ఉద్యోగాలు కల్పించడానికి బదులుగా స్టాఫింగ్ సంస్థల నుండి కిక్‌బ్యాక్ తీసుకుంటున్నారని విజిల్‌బ్లోయర్ కంపెనీ సిఇఒకి లేఖ రాయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో పాల్గొన్న వారు రూ.100 కోట్లు సంపాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News