Saturday, September 21, 2024

మణిపూర్‌లో భగ్గుమన్న మంటలు..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో ఓ గుంపు రాష్ట్ర మంత్రి ఎల్ సుసినోడ్రో గోడౌన్‌ను తగులబెట్టింది. ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని పోలీసులు శనివారం తెలిపారు. ఈ దగ్ధకాండలో గోడౌన్ పూర్తిగా బూడిదయింది. కాగా ఇదే జిల్లాల్లోని ఖురాలీలో రాష్ట్ర వినియోగదారులు, ఆహార వ్యవహారాల మంత్రికి చెందిన నివాసానికి నిప్పు పెట్టేందుకు కూడా కొందరు యత్నించారు. దీనిని సకాలంలో పోలీసు, భద్రతా యంత్రాంగం అక్కడికి చేరుకోవడంతో నివారించగల్గింది. కులాల తెగల మధ్య వైరాలతో మణిపూర్ మూడు నెలలుగా రగులుతోంది. ఈ క్రమంలో ఆగకుండా విధ్వంసకాండలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ దశలో మంత్రుల ఆస్తులను లక్షంగా చేసుకుని మూకగా వచ్చి దాడికి దిగుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత మంత్రుల నివాసాలపై దాడికి యత్నించారు.

ఖురాలీలో మంత్రి నివాసాన్ని చుట్టుముట్టేందుకు గుమికూడిన జనాన్ని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు పలు రౌండ్ల భాష్పవాయువు ప్రయోగించారు. దీనితో రాత్రిపూట ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడటం లేదా చనిపోవడం జరగలేదని అధికారులు తెల్లవారుజామున తెలిపారు. ఇంతకు ముందు లాంఫల్ ప్రాంతంలో రాష్ట్రంలోని ఏకైక మహిళా మంత్రి నెమ్చా కింగ్‌పెన్‌కు చెందిన అధికారిక బంగళారే నిరసనకారులు నిప్పంటించారు. ఈ నెల 14వ తేదీన ఈ ఘటన జరిగింది. మరుసటి రోజున రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఆర్‌కె రంజన్ సింగ్ ఇంటిపై దాడికి యత్నించారు. మరుసటిరోజు తగులబెట్టేందుకు ఘర్షణకారులు యత్నించారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక్కడికి వచ్చి రెండు మూడు రోజులు బస చేసినా, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించినా పరిస్థితిలో మార్పు రాలేదు.

మరో వైపు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని, ఇప్పుడు చివరికి సిరియా, లెబనాన్ వంటి దేశాలలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితి ఏర్పడుతోందని ఈ మధ్యనే విశ్రాంత సీనియర్ సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మే 3వ తేదీనుంచి మణిపూర్‌లో వర్గపోరు ఆరంభం అయింది, అంతం లేకుండా సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News