Friday, December 20, 2024

రెజ్లర్లపై నేతల తప్పుడు ప్రచారం : వినేష్ పొఘాట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నేతలు రెజ్లర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కామన్‌వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత, ప్రముఖ రెజ్లర్ వినేష్ పొఘాట్ ఆరోపించారు. ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షిమాలిక్,భజరంగ్ పునియా కూడా ఇదే అభిప్రాయం వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశాలపై తాము ప్రజల ముందకు వస్తామని పేర్కొన్నారు. మహిళా రెజ్లర్ల పర్యవేక్షక కమిటీలో సభ్యుడిగా బీజేపీ నేత యోగేశ్వర్ దత్ నియామకాన్ని పొఘాట్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఆయన రెజ్లర్లకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని, అయినా ఆయనను కమిటీల్లో ముద్ర పడిందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News