కొల్లాపూర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బైపాస్ రోడ్డు షాద్‌నగర్ సర్కిల్ వద్ద మహేంద్ర బులెరో ట్రాలీ వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీ కొనడంతో బొలెరోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కొల్లాపూర్ ప్రాంత వాసులు మరణించారు. పానుగల్ మండలం మందాపూర్ గ్రామ వాసవి డ్రైవర్ అశోక్(28), కోడేరు మండలం మైలాపూర్‌కు చెందిన రవి నాయక్(30) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా పానుగల్ మండలం తెల్లరాళ్లపల్లి తండా వాసి శంకర్ నాయక్ (32) ప్రాణాపాయ స్థితిలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.
బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెలను అమ్మడానికి హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి స్వగ్రామాలకు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చనిపోయిన వారి వద్ద లబ్ధించిన నగదు ఒక లక్షా 90 వేల రూపాయలు, మొబైల్ ఫోన్లను అంబులెన్స్ సిబ్బంది షాద్‌నగర్ పోలీసులకు అప్పగించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించడంతో షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.