Monday, December 23, 2024

ఓఆర్‌ఆర్ బాధితులకు ప్లాట్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఅర్‌అర్) ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) శనివారం స్థలాలు (ప్లాట్లను) లాటరీ పద్ధతిలో కేటాయించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రాజెక్ట్ సిజిఎం మాజిద్ హుస్సేన్, ఓఆర్‌ఆర్ ప్రాజెక్ట్ (ఆర్‌అండ్‌ఆర్) స్పెషల్ ఆఫీసర్ వి.విక్టర్, తహశీల్దార్ ఎం.భిక్షపతి ఆధ్వర్యంలో శనివారం నానక్‌రాంగూడ లోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జిసిఎల్) కార్యాలయంలో 33 మందికి ప్లాట్లను కేటాయించి వాటి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

రంగారెడ్డి జిల్లా, కోహెడ గ్రామం పరిధిలోని సర్వేనెంబర్ 507లో దాదాపు 100 ఎకరాల భూమిని ఆర్ అండ్ ఆర్ బాధితుల కోసం అభివృద్ధి చేసిన లే ఔట్‌లో 33 మంది లబ్ధిదారులకు శనివారం లాటరీ పద్ధతిన ప్లాట్లను హెచ్‌ఎండిఏ కేటాయించింది. వీటిలో 100 గజాల విస్తీర్ణం కలిగిన 20 ప్లాట్లు ఉండగా, 150 గజాల విస్తీర్ణం కలిగిన 10 ప్లాట్లు, 200 గజాల ఒక ప్లాటు, 250 గజాల ఒక ప్లాటు 300 గజాల ఒక ప్లాట్ చొప్పున మొత్తం 33 ప్లాట్లను కేటాయించి వారికి ధ్రువీకరణ పత్రాలను (అలాట్‌మెంట్ లెటర్లను) అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ డిజిఎంలు రమేష్, రవీందర్, సంజయ్, డిప్యూటీ తహసీల్దార్ సలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News