ఖమ్మంరూరల్: లింగంపల్లి వీరస్వామి ఆదర్శప్రాయుడని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక స ంఘం జిల్లా కమిటీ సభ్యుడు లింగంపల్లి వీరస్వామి సంస్మరణ సభ సిపిఎం సీనియర్ నాయకుడు సిద్ధినేని కోటయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించా రు. ఈ సభలో తమ్మినేని మాట్లాడుతూ అనుక్షణం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి లింగంపల్లి అన్నారు. గ్రా మంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వం ట మాస్టర్ గానే కాకుండా, వ్యవసాయ కూలీల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర వీరస్వామికి ఉందన్నారు.పార్టీ అప్పగించిన ప్రతి పనిని నిజాయితీతో చేసిన వ్యక్తి అన్నారు. వీరస్వామి ఆశయ సా ధన కొరకు గ్రామంలోని యువత కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పొన్నెకంటి సంగ య్య, మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు తమ్మినేని వెంకట్రావు,తమ్మినే ని కోటేశ్వరరావు, వాసిరెడ్డి వరప్రసాద్, రంజాన్, రజక సంఘం నాయకులు దొనకొండ ముత్తయ్య, సై దులు, వీరస్వామి మనవడు మురళీ తదితరు లు పాల్గొన్నారు.