పంజాగుట్ట: బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో కొలుస్తారు. తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. యావత్ తెలంగాణ ప్రజలు ఆ అమ్మవారిని ఎంతో భక్తితో కొలుస్తుంటారు. ఇక అలాంటి దేవాలయంలో అ మ్మ వారి కళ్యాణం అంటే మాటలు కాదు. వేలాది మం ది భక్తులు తరలివచ్చి అమ్మవారి కళ్యాణాన్ని తిలకిస్తా రు. ఎన్నో ఏళ్లుగా ఈ కల్యాణ ఏర్పాట్లు జరుగుతుంటా యి. అయితే ఈ ఏడు జరిగిన అమ్మవారి కళ్యాణం ఏ ర్పాట్లలో ఆలయ నిర్వహణ అధికారులు ఘోరంగా వి ఫలం చెందడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఇంత పెద్ద కల్యాణ వేడుకలకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన ఆలయ కార్యనిర్వహణ అధికారులు కేవలం చందాల సేకరణ, ప్రముఖల సేవలపై దృష్టి పెట్టారు తప్ప భక్తుల ఏర్పాట్లపై దృష్టి పెట్టలేదు అ ని అనిపిస్తుంది. వీరి నిర్లక్షం వల్ల వేలాదిమంది భక్తులు క్యూలైన్‌లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి కొందరు వృద్ధులు, చిన్నారులు స్పృహ తప్పి పడిపోయా రు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆలయ అధికారులు గతంలో మాదిరిగానే వేలసంఖ్య లో వివిఐపి, విఐపి పాసులు జారీ చేయడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువతున్నాయి. ఈపాస్‌ల జారీపై గతంలో కూడా సాధారణ భక్తులు ఆగ్రహం వ్య క్తం చేశారు. అయినా ఈసారి కూడా వేలసంఖ్యలో పా స్‌లు ఇవ్వడం వల్ల అనేకమంది భక్తులు ఆ పాస్‌లు పెట్టుకొని క్యూలైన్‌లో నిల్చోవడం, వారి లైన్‌లు భారీగా పెరగడం వల్ల తోపులాట చోటు చేసుకుంది. అయితే ఈ పాస్‌ల వ్యవహారం ఎవ్వరికి అంతు చిక్కని ప్రశ్నగా మా రింది.
గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాస్‌ల సంఖ్య తగ్గించాలని ఆలయ పాలకవర్గ సభ్యు లు, ఇతర శాఖల అధికరులు కొందరు ఆలయ ఈఒకు ముందే సూచన చేసినప్పటికి ఆ ఈఓ పట్టించుకోలేదని సమాచారం. కేవలం తమ ప్రాబల్యాన్ని చాటు కోవడం కోసమే ఇన్ని పాస్‌లు జారీ చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. గతంలో ‘మహాంకాళి’లో ఎంతో అనుభవం ఉ న్న అధికారిని కూడా ఏర్పాట్లలో విఫలం అవ్వడం పలువురిని ఆవేదనకు గురి చేస్తుంది. ఇక ఏర్పాట్లలో విఫలం అవ్వడం ఒక్క ఆలయ అధికారిని మాత్రమే కాకుండా ఇతర శాఖల అధికారులది భాగం ఉందని తెలుస్తుంది. అధికారుల మధ్య సమన్వయలోపం కూడా కారణమ ని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి అమ్మవారి కల్యాణ ఏర్పాట్లలో విఫలం అయ్యారని ప లువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉం టే ఇక కళ్యాణం కోసం అయినా ఖర్చుల గూర్చి కూ డా పలు అనుమానాలు కలుగుతున్నాయి. కల్యాణ ఏర్పాట్ల కోసం ఖర్చుల వివరాలపై బహిరంగ శ్వేత పత్రం విడుదల చేయాలనీ కొందరు భక్తులు, దాతలు కోరుతున్నారు. మండపాలు మొదలు శాలువాల వరకు అయిన ఖర్చులు, అన్నదానం నుంచి పూలదండల ఖ ర్చుల వెనుక ఏదో మతాలబు ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి.
గత ఏడాది కల్యాణ ఖర్చులపై ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద ఖ ర్చుల వివరాలు అడిగితే ఆలయ అధికారులు ఎండోన్‌మెంట్ శాఖకు సమాచార హక్కు చట్టం వర్తించదు అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కొందరు ఆల య అధికారులపై గతంలో ఆరోపణలు రావడం వల్ల సహజంగానే అనుమానాలు వస్తాయని, అయితే ఇలాం టి ఆరోపణలకు తావులేకుండా కళ్యాణం కోసం వచ్చిన విరాళాలు, ఖర్చు చేసిన వివరాలు బయటకు వెల్లడిస్తే బాగుంటుంది అని పాలకవర్గ సభ్యుడు ఒకరు అభిప్రాయ పడ్డారు. ప్రతి ఏటా ఇలా చేస్తే భక్తులల్లో కూడా విశ్వాసం, సంతృప్తి కలుగుతుంది ఆయన చెప్పారు. మొత్తానికి లక్షలాది తరలివచ్చే ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఏర్పాట్లలో అధికారుల విఫలం పట్ల మంత్రి తలసాని కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రి స్వయంగా ఏర్పాట్లపై వరుస సమావేశాలు పెట్టి కష్టపడిన కూడా అధికారుల నిర్లక్షం వల్ల విమర్శలు రావడం పై మంత్రి అసంతృపి వ్యక్తం చేసినట్టు సమాచారం.