Monday, December 23, 2024

ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఉపా కేసులు ఎత్తివేయాలి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: ప్రజాస్వామ్య దేశంలో ఉపా లాంటి చట్టాలు ఉండాల్సినవి కా వని విద్యా పరిరక్షణ కమిటీ ప్రధా న కార్యదర్శి ప్రొ. హరగోపా ల్ అన్నారు. విద్యా రంగం పరిరక్షణ, విద్యా రంగ అభివృద్ది కోసం కావాల్సిన మౌలిక అవసరాలను తీర్చాలని ప్రభుత్వాలను ప్రశ్నించిన ఉపాధ్యాయులు, వి ద్యార్థు లపై నమోదు చేసిన ఉపా కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆయ న డి మాండ్ చేశారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివా రం ని ర్వహించిన విలేకరుల సమావేశంలో హరగోపాల్ మాట్లాడుతూ కేజీ టు పీజీ వర కూ ఉచిత విద్య అని, కామన్ స్కూల్ విధానం ద్వారా అసమానతలు నిర్మూలన చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ 9 ఏళ్లల్లో తగిన నిధులు కేటాయించకపోవడం తో విద్యా రంగం విధ్వంసం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో వి ద్యా రంగానికి 11 శాతం నిధులు ఉండగా, ప్రస్తుత ప్రభుత్వంలో 6.5 శాతానికి తగ్గించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడితే సు మారు 70 వేల ఉపాధ్యాయ పోస్టులు అవసరం అవుతాయన్నారు.

ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యనిర్వహక కార్యదర్శి ప్రొ.కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థు లు, ప్రజాస్వామ్య వాదులపై కేసులు మోపడం అప్రజాస్వామి కం అని అన్నారు. ఏ కారణం లేకుండానే నిర్భందిస్తూ, ప్రజాస్వామ్యానికే ప్ర మాద కరంగా మారుతున్న ఉపా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ విద్యార్థి సంఘా ల నాయ కులు మహేష్, రామకృ ష్ణ, ఆజాద్, అల్లూరి విజయ్, ఎంఎన్ కిష్టప్ప, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News