సికింద్రాబాద్ : స్థానిక సమస్యల పరిష్కారానికి వార్డు కార్యాలయాలు దోహదపడుతాయని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. శనివారం సీతాఫల్‌మండి డివిజన్‌లోని బీదల బస్తీలో వార్డు కార్యాలయాని అధికారులు , స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్డాడుతూ పాలనలో పారదర్శక, స్థానిక సమస్యల సత్వర పరిష్కారం కోసం వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని , నియోజకవర్గంలో అన్ని డివిజన్‌లలో వార్డు కార్యాలయాను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల వద్దకే పాలన దిశగా అవినీతికి తావు లేకుండా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరంచడానికి వార్డు కార్యాలయాలు దోహదపడుతాయన్నారు.
ఇదివరకు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగే వారని ఇకనుంచి ప్రభుత్వ విభాగాల అధికారులు వార్డు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజా ఫిర్యాదులు, సమస్యలపై ఎప్పటకికప్పుడి స్పంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని అన్పి మున్సిఫల్ డివిజన్‌లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆయన డివిజన్‌లోని ఆయా ప్రాంతాలలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిసి ధశరద్, ఆశాలత, కృష్ణ, సంధ్య , నాయకులు రామేశ్వర్ గౌడ్, సుంకు రాంచదర్, కరాటే రాజు తదితరులు పాల్గొన్నారు.