Sunday, January 19, 2025

బహుజనులు జీవించే హక్కును కోల్పోతున్నారు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ ః రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉన్నప్పటికీ, వివక్షత కారణంగా బహుజనులు జీవించే హక్కును కోల్పోతున్నారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పూర్వ న్యాయమూర్తి జస్టీస్ జి. చంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల ప్రజలకు హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్టు వాపోయారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ న్యాయమూర్తి గుండ చంద్రయ్యకు బంధు సొసైటీ ఆధ్వర్యంలో శనివారం బహుజనుల ఆత్మీయ సత్కారం జరిగింది.

ఈ కార్యక్రమానికి బంధు సొసైటీ అధ్యక్షులు పల్లేల వీరస్వామి అధ్యక్షత వహించగా మాజీ ఎస్సీ కమిషన్ సభ్యులు కె. రాములు, ఎస్సీ, ఎస్టీ బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు జి. శంకర్, మాజీ ఐఆర్‌టిఎస్ అధికారి డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్ ఎన్‌టిపిసి రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఆరేపల్లి రాజేంద్ర, ఉస్మానియా యూ నివర్శిటీ ప్రొఫెసర్ నతానియేల్, ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజమౌళి, టాంగ్ వాల్మీకీ సమాజం నాయకులు శ్యామ్‌లాల్, బహుజన రాజ్యాధికార సమితి నాయకులు వనపాక నర్సింహా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి దయానంద్ తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమ పథకాలు క్రమేణా తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఆయా శాఖలకు ఉండాల్సిన నిధులను ఖర్చుకు చేయకుండా రానున్న ఎన్నికల్లో రాజకీయంగా వినియోగించడం కోసం నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. బహుజనులంతా ఐక్యమై రాజ్యాధికారం వైపు పయనించాల్సిని అవసరం ఎంతైనా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News