Monday, December 23, 2024

బీర్పూర్ లో నడిరోడ్డుపై పట్టపగలే యువకుడిని గొడ్డలితో నరికి

- Advertisement -
- Advertisement -

బీర్పూర్: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై పట్టపగలే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌పై వెళ్తున్న యువకుడిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం అతడి వద్ద ఉన్న ఫోన్‌ను లాక్కొని పారిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షలు లేక వివాహేతర సంబంధం హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బ్రెయిన్ స్ట్రోక్ అతి ప్రమాదకరం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News