Monday, January 20, 2025

ఆత్మీయ ఏక గ్రీవ తీర్మాణం ఇవ్వడం మీతో మొదటి బోణి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : ఆత్మీయ ఏక గ్రీవ తీర్మాణం ఇవ్వడం మీతో మొదటి బోణి అని, మీఅందరి ప్రేమ , అభిమానం ఆదరణకు నాకు నాలా సంతోషంగా ఉందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం మాల ఎంప్లాయిస్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా ఆత్మీయ తీర్మాణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌లతో కలిసి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సిఎం కెసిఆర్ రాష్ట్ర రాజదానిలో 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి గౌరవించుకున్నామన్నారు.

ఎంఈఎపి కోరినట్లుగా 500 గజాల స్థలాన్ని కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు సిద్దిపేట వాసులుగా మీరంతా అదృష్టమంతులు, తెలంగాణ రాష్ట్ర జాతీపిత సిఎం కెసిఆర్ ఆలోచన విధానాలు అమలు చేసేది మంత్రి హరీశ్ రావు అని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ అన్నారు. మంత్రి హరీశ్‌రావుకు అండగా ఉంటామని మాల ఎంప్లాయిస్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ తీర్మాణం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. మొదట మీతోనే శంఖం పూరించినట్లు మూడవ సారి కూడా బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని సిఎం కెసిఆర్ ఉంటారన్నారు. సిద్దిపేటలో హరీశన్న విషయానికోస్తే చెప్పేదేమి లేదని మీరే అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మాణంతో స్పష్టమవుతుందన్నారు.
మాల ఎంప్లాయిస్ ఏకగ్రీవ తీర్మాణం : సిద్దిపేట ప్రజా సేవకులు, అభివృద్ధ్ది సాధకులు, జనం మెచ్చిన నాయకులు మంత్రి హరీశ్‌రావుకు మాల ఎంప్లాయిస్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ తీర్మాణం అందజేయాలని నిర్ణయించామని అధ్యక్షుడు కనకయ్య తెలిపారు. సిద్దిపేట నియోజక వర్గాన్ని గర్వపడేలా అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన మంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 9 ఏళ్ల కిందట ఉన్న సిద్దిపేటతో పోల్చితే సిద్దిపేట నియోజక వర్గాన్ని అద్భుతంగా ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. ఈ ఆత్మీయ తీర్మాణాన్ని మీకు అందజేయాలని నిశ్చయించుకున్నామన్నారు. మాల ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రదాన కార్యదర్శి స్వామిదాస్, డిప్యూటీ తహశీల్దార్ రాజేశం, అసోసియేషన్ సభ్యుల కుటుంబ సమేతంగా మంత్రికి తీర్మాణ పత్రాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News