Monday, December 23, 2024

మేరు సంఘం ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు 34వ డివిజన్ శివనగర్‌లో మేరు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తాళ్ల సంపత్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మేరు సంఘం కులస్థులందరికీ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థికసాయాన్ని అందించాలన్నారు. కాగా జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జి, అడహక్ కమిటీ కన్వీనర్ పెండ్యాల హరిప్రసాద్ మేరు, ఎన్నికల పరిశీలకులుగా కర్నె రవీందర్ మేరు, గూడూరు బాలాజీ మేరు ప్రకటించారు.

అధ్యక్షుడిగా మాడిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఓదెల ప్రభాకర్, కోశాధికారిగా ఓదెల రమాదేవి, ఉపాధ్యక్షులుగా గూడూరు మధుసూదన్, ఓదెల రవి, రాయబారపు విజేందర్, గూడూరు పూర్ణచందర్, గూడూరు రాజేష్, కార్యదర్శులుగా గూడూరు విజయ, రామగిరి శంకర్, మాడిశెట్టి సత్యనారాయణ, గూడూరు సత్యనారాయణ, ఓదెల రాజేష్, నిర్వాహక కార్యదర్శులగా ఓదెల రవి, రాయబారపు లత, గూడూరు శ్వేత, రామగిరి లలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ 2023 నుంచి 2026 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేరు కులస్థులు సోమలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News