Friday, November 22, 2024

రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : జూన్ 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దశాబ్ది కాలం గడిచిన కూడా ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల వరకు పూర్తిగా విద్యను నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య అంటూ ప్రకంపనలు పలికి వారి హామీలను అమలు చేయకుండా రేప్పులైజేషన్ పేరు మీద 8,624 ప్రభుత్వ పాఠశాలలు మూసి వేశారన్నారు.ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవని, 6800 ప్రాథమిక పాఠశాలలో

ఒకే టీచరు ఉన్నారని, 596 మండలాల్లో 578 మండలాలకు విద్య అధికారులు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకుండా మౌళిక వసతులు కల్పిస్తే ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థికి ఏ విధంగా నాణ్యమైన విద్య అందుతుందని ప్రశ్నించారు. పాఠశాల బంద్ పిలుపులో భాగంగా ప్రతి ఒక్క పాఠశాల స్వచ్చందంగా పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణు, నందు, జోనల్ ఇంచార్జిలు శ్రీవర్థన్, నగర కార్యకర్తలు అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News