Monday, December 23, 2024

గృహలక్ష్మిపథకంలో వికలాంగులకు 5 శాతం రిజ్వేషన్స్ అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎన్‌పిఆర్‌డి ప్రతినిధి బృందం వినతి
రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్వంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ 3 లక్షల ఆర్థిక సహాయం చేయడానికి గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం నిబంధనలు రూపొందిస్తూ జిఓ నెంబర్ 25 విడుదల చేసిందని తెలిపారు. ఇందులో ఎస్‌సిలకు 20 శాతం, ఎస్‌టిలకు 10 శాతం, బిసి, మైనారిటీలకు 50 శాతం రిజ్వేషన్స్ తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందిదన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం వికలాంగులకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని స్పష్టం చేస్తుందని. రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్స్ సంక్షేమ పథకాలలో అమలు చేయాలని జివో విడుదల చేసిందని గుర్తు చేశారు.

కాగా జూన్ 21న రవాణా, రోడ్లు, భవనల శాఖ విడుదల చేసిన జిఓ 25లో కులాల వారిగా రిజర్వేషన్స్ అమలు చేయాలని పేర్కొన్నారని, వికలాంగులకు అమలు చేయాల్సిన రిజర్వేషన్స్ పై జిఓ లో ఎక్కడా పేర్కొనలేదని పేర్కొన్నారు. .2016 ఆర్‌పిడి చట్టానికి బిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేశారని తెలిపారు . వెంటనే జీఓను వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేస్తూ సవరించాలని వారు మంత్రికి విన్నవించారు. వికలాంగుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రచారం చేస్తున్నారు కాని చట్ట ప్రకారం వికలాంగులకు దక్కవల్సిన రిజర్వేషన్స్ అమలు చేయకుండా మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు జీఓలు విడుదల చేస్తున్నప్పుడు వికలాంగులకు 5 శాతం కేటాయించే విధంగా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ మాత్రం తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిసస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ నిర్లక్ష్యం వికలాంగుల పాలిట శాపంగా మారుతోంని ఆందోళన వ్యక్తం చేశారు. జివో 25 లో వికలాంగులకు రిజర్వేషన్స్ పొందుపర్చలేదనే విషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకెరళ్ళినా తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని మంత్రికి విన్నవించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో ఏముందో తెలియని డైరెక్టర్ శైలజ కు డైరెక్టర్ గా కొనసాగే అర్హత లేదని అన్నారు. వివిధ శాఖల అధికారులు 2016 ఆర్‌పిడి చట్టానికి తూట్లుపొడుస్తుంటే పర్యవేక్షించాల్సిన కమిషనర్ ఏమి పట్టనట్లు వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు తప్పనిసరిగా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం చాలా మంది వికలాంగులకు అన్యాయం జరుగుతుందని. ఆహార భద్రత కార్డ్ తో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే 3 లక్షల రూపాయలు ఏమాత్రం సరిపోవని, .వికలాంగులకు ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వికలాంగులకు రిజ్వేషన్స్ అమలు చేయిస్తాం… మంత్రి హామీ
గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు 5 శాతం రిజ్వేషన్లు అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చినట్లు ఎన్‌పిఆర్‌డి ప్రతినిధులు తెలిపారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఏం అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News