Monday, December 23, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నెవర్ ఎండింగ్, నెవర్ స్టాప్‌డ్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నెవర్ ఎండింగ్, నెవర్ స్టాప్‌డ్ కార్యక్రమంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అభివర్ణిం చారు. తనకు మార్గదర్శి భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ఆర్కిటెక్ కెసిఆర్ అని అన్నారు. కెసిఆర్‌తో కలిసి 23,24 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ ఇన్ ఇండియా కెసిఆర్ అని కీర్తించారు. 1980లో కెసిఆర్ ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో ‘సిద్ధిపేటకు హరితఃహారం’ కార్యక్రమానికి అంకురార్పణ జరిగిందన్నారు. ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఆయన ఇంటర్వూ ఇచ్చారు. ఆ సమయంలో గ్రీన్‌కవర్ పెంచేందుకు అనువుగా ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు అనువుగా పలు ఇన్సెంటివ్‌లతో గ్రీన్‌కవర్ పెంపుదలకు దోహదం చేస్తూ వచ్చారు.

తదనంతర కాలంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమవ్వడం, 2014లో నూతన తెలంగాణ ఆవిష్కృతమవ్వడం తెలిసిందేనన్నారు. 2014లో గ్రీన్ కవర్ 22 శాతం మాత్రంగానే ఉండేదన్నారు. సిఎం కెసిఆర్ మానసపుత్రికగా పరిగణించే హరితహారం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గడిచిన ఏడెండ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలు నాటిన ఘనత సిఎం కెసిఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. హరిత హారంతో రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని ఈ సందర్భంగా ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ గుర్తు చేశారు.

నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలతో పచ్చదనం అభివృద్ధికి 10 శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయించి మొక్కలు పెంచుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర మేనని ఎంపి సంతోష్ స్పష్టం చేశారు. 2014లో 22శాతం మాత్రమే గ్రీన్ కవరేజ్ ఉండేదని వెల్లడించారు. ఆ శాతాన్ని మరింతగా పెంపుదల చేసే క్రమంలో హరితహారం కార్యక్రమం ముందంజలో ఉందన్నారు. 2018 సంవత్సరంలో తన మార్గదర్శి కెసిఆర్ స్ఫూర్తితో తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించానన్నారు.

తన సహచరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో తొలుత ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగిందని గుర్తు చేశారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వాములయ్యా రన్నారు. ఈ క్రమంలో పలు ఛాలెంజ్‌లను ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ తాను ఇచ్చిన పిలుపుతో యావ న్మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రజలను భాగస్వామ్యులను చేయ డంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించామన్నారు. సదరు అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తూ వస్తున్నాయన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములవ్వుతూ వస్తున్నారు. తత్ఫలితంగా దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం తమ తమ రాష్ట్రాల్లో గ్రీన్ కవర్‌ని పెంపుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. అంచెలంచెలుగా పురోగమిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నెవర్ ఎండింగ్, నెవర్ స్టాప్‌డ్ కార్యక్రమంగా ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ పునరుద్ఘాటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News