ఖమ్మం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మున్నూరు కాపులకు సముచిత గౌరవం ఇస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.గతంతో పోల్చిన పక్షంలో కేసీఆర్ ప్రభుత్వంలో మున్నూరుకాపులకు గౌరవప్రదమైన పదవులు లభించాయని, ప్రత్యేక మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా తథ్యమని ఆయన అన్నారు. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొం డా దేవయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఎంపీ రవిచంద్ర నివాసంలో సంఘం 33జిల్లా శాఖల అధ్యక్షుల సమావేశం జరిగింది.
ఈ సంఘం గౌరవాధ్యక్షులైన ఎంపీ రవిచంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కెసిఆర్ గతంలోనే సానుకూలంగా స్పందించారన్నారు. తాను, మంత్రి గంగుల కమలాకర్, ఎంపి కేశవరావుల ఆధ్వర్యంలో మున్నూరుకాపు ప్రజాప్రతినిధులను వెంట తీసుకుని కేసీఆర్‌ను త్వరలో కలుస్తామని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సిందిగా, ము న్నూరుకాపు ప్రముఖులు పలువురికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని సిఎం విజ్ఞప్తి చేస్తామని ఎంపి రవిచంద్ర వివరించారు.
రాష్ట్రఅధ్యక్షులు కొండా దేవయ్య మాట్లాడుతూ ఓకే కులం-ఓకే సంఘం గొడుగు కింద మనమందరం ఏకతాటిపై నడుద్దామన్నా రు. ఐకమత్యమే బలమని, మరిం త సంఘటితంగా ముందుకు సాగడం ద్వారా న్యాయమైన మన హక్కుల్ని సా ధించుకుందామని చెప్పారు. మున్నూరుకాపుల సర్వతోముఖాభివృద్ధికి గా ను ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఇటీవల తహశీల్దార్, కలెక్టర్స్ వినతిపత్రాలు అందజేసే కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ విషయమై సిఎం కెసిఆర్ త్వరలోనే సానుకూల ప్రకటన చేస్తారని ఆ శాభావంతో మున్నూరు కాపులు ఎదురు చూస్తున్నారన్నారు. సానుకూల ప్రకటన రానట్టయితే ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున ఉత్తరాల ద్వారా విజ్జప్తి చేస్తామని వివరించారు.
ఈ సమావేశంలో సంఘం ప్రముఖులు చల్లా హరిశంకర్, మరికల్ పోత సుధీర్ కుమార్, ఆకుల గాంధీ, పారా నాగేశ్వరరావు, ఊసా రఘు, వద్దిరాజు దేవేందర్, జిల్లా శాఖల అధ్యక్షులు వాసుదేవుల వెంకటనర్సయ్య, బాదినేని రాజేందర్, ఆర్వీ మహేందర్, ప్రకాష్ రావు, నాయకు లు జెన్నాయి, కోడే జగన్మోహన్, హరీ ష్, వాసాల వెంకటేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి వద్దిరాజు, కొండా దేవయ్యలు సంఘం జిల్లా శాఖల అధ్యక్షులను శాలువాలతో సత్కరించారు.