కాచిగూడ: ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈనెల 24నుంచి 27వ తేదీ వరకు జరుగుతున్న అంతర్జాతీయ అండర్ వాటర్ ఫిన్స్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో స్విమ్మర్ గంధం క్వీన్ విక్టోరియా భారతదేశం తరపున పాల్గొని రజత పథకాన్ని సాధించింది. తెలంగాణలోని బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన స్విమ్మర్ గంధం క్వీన్ విక్టోరియా ఆదివారం 400 మీటర్ల (మోనో ఫిన్) ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని తొలి స్విమ్మర్‌గా గంధం క్వీన్ రికార్డుకెక్కింది.
క్వీన్ విక్టోరియా భారతదేశం తరపున అంతర్జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని రజత పథకం సాధించి, తెలుగు రాష్ట్రాల వైభవాన్ని, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈజిప్ట్ రాజధానిలో జాతీయ జెండా ఎగరవేసినందుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ప్రముఖులు క్వీన్ విక్టోరియాకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సోమవారం 200మీటర్ల (మోనో ఫిన్) ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటానని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.