Monday, December 23, 2024

వైశ్య వికాసవేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు పురస్కారాల అందజేత

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: విద్యార్థులకు పురస్కారాలు అందుకోవడంతో పాటు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఎమ్మెల్సీ బోగ్గారపు దయానంద్ గుప్తా , డెయిర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ కూమార్ అన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రతిభా పురస్కారాలను 2023 వైశ్యవికాస వేదిక వ్యవస్థాపక ఛైర్మన్ డా. కాచం సత్యనారాయణగుప్తా ఆధ్వర్యంలో కర్మన్‌ఘాట్ శ్రీలక్మీ కన్వన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యాతిథిలుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా , డెయిర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సోమ భరత్‌కూమార్ , సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, అడిషనల్ ఎస్‌పి సిఐడి పోల విజయ్‌కూమార్, వాసవి గ్రూప్స్ సీఎండి ఎర్రం విజయ్‌కూమార్‌లు హాజరై, జ్యోతి ప్రజల్వన చేశారు. అనంతరం మాట్లాడుతూ వైశ్యవికాస వేదిక అధ్వర్యంలో విద్యార్దులకు పురస్కారాలు అందించడంలో విద్యార్దుల లో జ్ఞానం పెంపెదించడంతో పాటు ప్రతిభను గుర్తించనట్లు తెలిపారు.

గడిచిన ఐదు సంవత్సరాలుగా వైశ్యవికాస వేదిక ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేస్తున్నారని తెలిపారు. సత్యనారాయణగుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులాల వృత్తిని కాపాడుకోవాలని, విద్యార్థులకు చదువుకు అవసరంపడే సహాయం అందించాలని, విద్యకు అవసరమపడే సహాయ సహకారలు అందించాలన్నారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వైశ్యులలో 5శాతం రాజ్యాధికారం సాధించాలని, పార్టీలకతీతంగా వైశ్యులు చట్ట సభల్లో పోటీ చేయాలన్నారు. అనంతరం పదవ త రగతిలో జీపిఎ 10/10 వచ్చిన వారికి రూ.2000 నగదుతోపాటు పురస్కారం, ఇంటర్‌లో 990 మార్కులు సాధించిన వారికి నగదు ప్రోత్సాహం అందించారు. విద్యార్థులకు పతకాలు, ధృవపత్రాలు, మెమెంటోలు అందించారు.

ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా , జెడిపిటిసీ ఉప్పల వెంకటేష్ గుప్తా , రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారయణ, సాయిబాబా టెంపుల్ చైర్మన్ గుండా మల్లయ్య, తేలుకుంట్ల రమేష్ గుప్తా, ఈనాడు డిప్యూటీ న్యూస్ ఎడిటర్ రావికంటి శ్రీనివాస్, కాచం సుష్మా ,ట్రస్టు సభ్యులు కాచం సాయి, కండె రాంనరేష్, రమేష్ , కాచం శ్రీనివాస్, విద్యార్థులు , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News