మరిపెడ: రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా నిర్మించిన నూతన ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం గోడౌన్‌ను జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పిఏసిఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతంతోనే వ్యవసాయ రం గ అభివృద్ధి చెందుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సహకార సంఘాలు నిర్వీర్యమై ఉన్నాయని తెలిపారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త సహకార సంఘాలను చైతన్యపరిచి అనేక రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎరువులు అందించడమే కాకా రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తుందన్నారు. సిఎం కెసిఆర్ కృషితో నేడు సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిపెడ సహకారం సంఘం అభివృద్ధిలో దూసుకుపోవడం అభినందనీయమన్నారు.
అనంతరం ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావుతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులను పిఏసిఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, డైరెక్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, పిఏసిఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి శ్రీనివాస్, మాజీ జడ్‌పిటిసి బాల్ని మాణిక్యం,
ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి రఘు, పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర్‌రావు, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుగులోతు రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, అయూబ్‌పాషా, మచ్చా వెంకటనర్సయ్య, చాపల శ్రీనివాస్‌రెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్లు భాషిపంగు సైదమ్మ, దారావత్ శ్రీనివాస్, లూనావత్ సోమాన్న, జినక యాకస్వామి, గుగులోతు బాలకిషన్, పులుసు వెంకన్న, ఈరగాని హేమలత, గుగులోతు వీరన్న, బానోతు హరినాయక్, మంగ వెంకన్న, రాసమల్ల వెంకన్న, తహశీల్దార్ పిల్లి రాంప్రసాద్, కమిషనర్ ఏ. రాజు, సిఈఓ బొల్లెపల్లి నరేష్, చారీ, ఎల్లయ్య, కౌన్సిలర్లు, కోప్షన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.