నిర్మల్ ప్రతినిధి : భారత ప్రజల ఆరాధ్యా దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఒక సాహసవంతమైన వీరుడని ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ముందు నిలబడి యుద్ధ్దాలలో అని రంగాలలో గెలిచి వ్యక్తి శివాజీ మహారాజ్ అని అన్నారు. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు ఎలానో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా అలాగే అందరి వాడని అన్నారు.
పూర్థిగా సెక్యూలర్ భావాలతో ఉన్నా వ్యక్తి శివాజీ మహరాజ్ అన్నారు. ఈ విషయంలో బిజెపి రాజకీయం చేస్తోందని అటువంటి వాటిని బిజెపి వెంటనే మానుకోవాలన్నారు. నిర్మల్ నడిబొడ్డున శివాజీ చౌక్‌లో 50 లక్షలతో కాంస్య విగ్రహాం ఏర్పాటు చేసింది తామేనన్నారు. బిజెపి శివాజీ మహాకాజ్‌ని రాజకీయం చేయడం మంచి పద్ధ్దతి కాదని మరో వైపు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ ఒక్క బిజెపి నాయకుడైన పాల్గొన్నాడా అని ప్రశ్నించారు.
2001లో మేము 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో సోనియా గాంధీకి, ప్రణబ్ ముఖర్జీ ఎందరో నాయకులను కలిసి లేఖ ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ యొక్క 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే నిర్మల్ అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నట్లు తెలిపారు.