Monday, December 23, 2024

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, కార్యకర్తలే పార్టీకి బలమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీలో సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు అండగా ఉంటానని అన్నారు.

మండల పరిధిలోని పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన బాలపీరు, శ్రీపురం గ్రామానికి చెందిన ఎం. చెన్నయ్య, తిమ్మాజిపేట మండల ఆవాంఛకు చెందిన అమ్మపల్లి నర్సింహా, బిజినేపల్లి మండలంలోని ఎర్రకుంటతండాకు చెందిన ముడావత్ రాజు, తాడూరు మండల పరిధిలోని పాపగల్‌కు చెందిన యాట వెంకటయ్య, తెలకపల్లి మండల పరిధిలోని బోలగుండం గ్రామానికి చెందిన కడెం చిన్నయ్య, రాకొండ గ్రామానికి చెందిన బిజ్జ చందు కుటుంబానికి రెండు లక్షల చొప్పున పార్టీ ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేశారు.

అదే విధంగా 59 మంది లబ్ధ్దిదారులకు 31 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి ప్రాణమని, కార్యర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీ మనుగడ పార్టీ కార్యకర్తలపై ఆధారడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్రంలోని ఏ పార్టీలో లేని విధంగా భీమా సదుపాయం కల్పిస్తున్నారని అన్నారు.

వారి ప్రీమియంను కూడా చెల్లించే విధంగా ఏర్పాటు చేశామని, పార్టీ కోసం పనిచేసే వారికి బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందన్నారు. గ్రామాల స్థాయి నుంచి పార్టీని పటిష్ట పరచడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందని, బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న పత్రి కార్యకర్తకు ప్రమాద భీమా వర్తిస్తుందని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు.

= ఎస్సీ కార్పొరేషన్ చెక్కుల పంపిణీ
అనంతరం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు ఎస్సి కార్పొరేషన్ ద్వారా 26 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News