Sunday, December 22, 2024

పేదలందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ : పేదలందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి. ఈశ్వర్ మాట్లాడుతూ పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలు లేనటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారని, వారందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వాళ్లకు జిఓ 58, 59ల ప్రకారం ఇంటి స్థలం ఇచ్చి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. హనుమంతు, లబ్ధిదారులు శ్రీనివాసులు, కృష్ణ య్య, మధుకర్, దేవమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News