భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొని 10మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం అర్ధరాత్రి రాష్ట్రంలోని గంజమ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బెర్హమ్ పూర్ ఎంకెసిజి మెడికల్ కాలేజ్ కు తరలించారు.
ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి పట్ల సిఎం సంతాపం తెలిపారు. అలాగే, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: డ్రగ్స్ కేసు… 12 మందికి నోటీసులు!