Monday, December 23, 2024

ఉప్పల్‌లో స్కైవాక్ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః ఉప్పల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) నిర్మించిన స్కైవాక్ టవర్‌ను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం ప్రారంభించారు. అలాగే, ఉప్పల్ శిల్పారామంలో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్‌ను కెటిఆర్ ప్రారంభించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదాచారుల రక్షణ కోసం నలువైపులా రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను హెచ్‌ఎండిఏ సుమారు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించారు. రాబోయే వంద సంవత్సరాలకు పైగా ప్రజల సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదాచారుల వంతెన (ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పన జరిగిందని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు.

Also Read: భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు బయల్దేరిన సిఎం కెసిఆర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News