Saturday, December 21, 2024

స్వచ్ఛమైన తాగునీరుగా మూత్రం

- Advertisement -
- Advertisement -

మూత్రాన్ని స్వచ్ఛమైన తాగునీటిగా మార్చిన వ్యోమగాములు

న్యూయార్క్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోని వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అంతరిక్ష కేంద్రంలో ప్రత్యేక వ్యవస్థను ఉపయోగించి వ్యర్థ జలాల నుంచి స్వచ్ఛమైన తాగునీటిని సృష్టించ గలిగారు. అంతేకాదు తమ చెమట, శ్వాసతోపాటు మూత్రం నుంచి కూడా స్వచ్ఛమైన తాగునీటిని తయారు చేయగలిగారు. వ్యర్థ జలాలను మొదట ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనే ప్రత్యేక వ్యవస్థ ద్వారా వ్యోమగాములు సేకరిస్తారు. తరువాత ఈ మురుగు నీటిని శుద్ధి చేసి మలినాలను తొలగించి , తాగడానికి ఉపయోగపడే నీరుగా మారుస్తారు.

Also Read: బిఆర్‌ఎస్‌పై అసదుద్దీన్ ఒవైసి సంచలన వ్యాఖ్యలు

నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ( ఐఎస్‌ఎస్) వెళ్లిన వ్యోమగాములు ఈ సాంకేతికతను విజయవంతంగా నిర్వహించ గలిగారు. అంతరిక్షంలో తేమ ఉండదు. అయితే అక్కడున్న వ్యోమగాములు శ్వాస, చెమట నుంచి విడుదలయ్యే తేమను వాడుకున్నారు. ఈ తేమతోపాటు మూత్రాన్ని వాటర్ ప్రాసెసర్ అసెంబ్లీ (డబ్లు పి ఎ) అనే యంత్రం లోకి పంపారు. అందులో ప్రాసెసింగ్ జరిగిన తరువాత యూరిన్ ప్రాసెసర్ అసెంబ్లీ (యుపిఎ) అనే మరో యంత్రం లోకి పంపుతారు. ఈ యంత్రంలో వాక్యూమ్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా మూత్రం నుంచి స్వచ్ఛమైన నీటిని తిరిగి పొందుతారు. అయితే ఈ ప్రక్రియలో మూత్రం నుంచి ఉప్పు నీరు మాత్రమే లభిస్తుంది. ఉప్పు నీటిని ఇంకో దశలో శుద్ధి చేసి మంచినీటిగా మార్చడానికి శాస్త్రవేత్తలు బ్రైన్ ప్రాసెసర్ అసెంబ్లీ (బిపిఎ) అనే కొత్త టెక్నాలజీని పరీక్షిస్తున్నారు.

ఇది సున్నా గురుత్వాకర్షణ కలిగిన అంతరిక్ష వాతావరణం లో కూడా పనిచేస్తుంది. బ్రైన్ ప్రాసెసర్ అసెంబ్లీ అనే ఈ టెక్నాలజీ , యూరిన్ ప్రాసెసర్ అసెంబ్లీ (యుపిఎ) ద్వారా ఉత్పత్తి అయ్యే ఉప్పు నీటిని తీసుకొని తేమతో కూడిన నీటిలా మారుస్తుంది. వ్యోమగాముల శ్వాస, చెమట నుంచి విడుదలయ్యే తేమను ఈ క్రమంలో అది వాడుకుంటుంది. అంతరిక్ష నౌకలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లను నిలబెట్టడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి , ఉష్ణోగ్రత , తేమ స్థాయిలను నియంత్రించడానికి నీటిని ఉపయోగిస్తారు. నీరు ఒక రేడియేషన్ షీల్డ్‌గా కూడా పనిచేస్తుంది. హానికరమైన కాస్మిక్ రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతరిక్షంలో మొక్కలను పెంచడానికి, ప్రయోగాలు చేయడానికి, అంతరిక్ష యాత్రల సమయంలో ఆహార ఉత్పత్తిని సులభతరం చేయడానికి నీరు ఒక ముఖ్యమైన వనరుగా దోహదం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News