Friday, November 15, 2024

గ్రీవెన్స్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్‌డేలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 40 మంది అర్జీదారులతో ఎస్పీ అపూర్వరావు నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

ఈ రోజు వచ్చిన ఫిర్యాదులు భూ సమస్యలు, భార్య భర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్ సమస్యల పైన ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యల ను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధ ంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా,నమ్మకం కలిగించాలని అన్నారు.

ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శా ంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్‌లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News