Friday, December 20, 2024

రెండో విడత గొర్రెల పంపిణీకి హామీ

- Advertisement -
- Advertisement -

కోయిలకొండ: రాష్ట్ర ప్రభుత్వం యాదవుల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని రెండో విడత గొర్రెల పంపిణీ త్వరలో చేపట్టడం జరుగుతుందని కొండల టిఆర్‌ఎస్ సోషల్ వారియర్ అధ్యక్షులు హన్మంతు యాదవ్ అన్నారు. సోమవారం మండలంలోని చంద్రాసపల్లి గ్రామానికి చెందిన యాదవ సంఘంతో కలిసి హైదరాబాద్‌లో తెలంగాణ షిప్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కృషితో మండలంలోని ప్రతి కురుమ, యాదవుల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం జరుగుతు ందన్నారు. త్వరలోనే లబ్ధ్దిదారులకు రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి కార్పొరేషన్ సుముఖంగా ఉందన్నారు. కార్యక్రమంలో చంద్రస్‌పల్లి సర్పంచ్ గోపాల్ , యాదవ సంఘం నాయకులు రామచంద్రయ్య, బుగ్గయ్య, మల్లేష్ , హరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News