సిటీ బ్యూరో: ఉప్పల్-, నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు ఉప్పల్ భగాయత్ హెచ్. ఎం.డి.ఏ లే అవుట్‌లో సౌకర్యాలను కల్పించి సమస్యలను పరిష్కారం చేయాలని ఉప్పల్ కార్పొరేటర్ ఎం. రజిత పరమేశ్వర్‌రెడ్డి పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావును కోరారు. సోమవారం ఉప్పల్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కార్పొరేటర్ రజిత పరమేశ్వర్‌రెడ్డి కలిసి వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తేలడంతో పాటు వినతిపత్రం అందచేశారు. నిరుపేదలు ఇళ్ల వద్ద పెళ్లి శుభకార్యాలు చేసుకునే పరిస్థితిలో ఫంక్షన్ హాళ్లలో భారీ ఫీజులను భరించలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య మధ్య తరగతి ప్రజల కోసం ఉప్పల్‌లోని శిల్పారా మం వద్ద మల్టీఫర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించడాన్ని స్వాగతిస్తున్నామని, దీనికి నామమాత్రపు ఫీజు నిర్ణయించాలని కార్పొరేటర్ కోరారు.
అదేవిధంగా ఉప్పల్‌కు మణిహారంగా ఉన్న స్వైవాక్‌కు తోడుగా ఉప్పల్ – నారపల్లి వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడా ర్ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ రోడ్లను తవ్వేసి, ఎక్కడి పనులు అక్కడే వదిలి వేసి పత్తా లేకుండా పోవడంతో ప్రమాదాల బారిన దాదాపు 25 మంది వరకు మరణించారని తెలిపారు. ఈ పనులను వెం టనే పూర్తి అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ రజిత మంత్రి కెటిఆర్‌ను కోరారు. అదేవిధంగా ఉప్పల్ భగాయత్‌లోని హెచ్‌ఎండిఎ లే అవుట్‌లో రైతులకు ఎలాంటి నష్టం లేకుండా 1000 గజాల చొప్పున అభివృద్ధి చేసిన పాట్లను ఇవ్వడం చాలా సంతోషకరమని, అయితే ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందు లు పడాల్సివస్తోందని ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో లింగంపల్లి రామకృష్ణ , సల్ల ప్రభాకర్ రెడ్డి, సుంకు శేఖర్‌రెడ్డి, ఎరుకాల సతీష్ గౌడ్, మంద మురళీ కృష్ణ రెడ్డి, పెద్దిరాజు సందీప్, పంతులూరి భాస్కర్, పాలడుగు లక్ష్మణ్, మంద సుమన్ రెడ్డి, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, మశేట్టి రాఘవేంద్ర గుప్తా, పూజారి హనుమంతు, దాకురి జిత్తురెడ్డి, బచ్చ రా ము, సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.