Saturday, December 21, 2024

ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ దీపక్ తివారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుండి 85 ఫిర్యాదులను స్వీకరించా రు.వాటిలో 59 రెవిన్యూ శాఖ, మున్సిపల్ శాఖ 3, జిల్లా గ్రామీణాభివృద్ధి 3, జిల్లా అటవీ శాఖ 3, విద్యాశాఖ 5, నీటిపారుదల శాఖ 2, జిల్లా పంచాయితీ 5, సర్వే ల్యాండ్ 2, ఐసిడిఎస్, యువజన శాఖ, ఎస్.సి. కార్పోరేషన్ శాఖలు ఒక్కొక్కటి చొ ప్పున దరఖాస్తులు స్వీకరించమని అన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేటు పరిపాలన అధికారి నాగలక్ష్మి, కలెక్టరేటు సూపరింటెండెంట్ రామ్మూర్తి,వివిధ శాఖల జిల్లా అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News