Thursday, January 2, 2025

సమాజంలో అగ్రకుల ఆధిపత్యం సైన్యంలా పనిచేస్తోంది

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: దేశంలో ప్రభుత్వ ఆధీనంలోని ఆర్మీతో పాటు అగ్రకుల ఆధిపత్య వర్గాలకు చెందిన ఆర్మీలు సైతం పనిచేస్తు న్నాయని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫాసిజాన్ని మరింత బలోపేతం చేసేందుకే ప్రజల్లో ప్రశ్నించే తత్వం, ఆలోచించే విధానం లేకుండా ఉండేందుకే పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ద్వజమెత్తారు. బాగ్‌లింగంపల్లి సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకులు డివి కృష్ణ ప్రథమ వర్థంతి సభ సోమవారం జరిగింది.

ప్రజాప్రంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజి రాంచందర్ అధ్యక్షత వహించిన ఈ సభలో ప్రొ.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదు వుకునే పాఠ్య పుస్తకాల్లో డార్విన్ సిద్దాంతంతో పాటు డెమోక్రసీ, సోషలిస్టు అనే పదాలను తొలగించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని అంతం చేసేందుకు కుట్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. హిందూత్వ ఫాసిజాన్ని ఓడించేందుకు రాజకీయ ఉద్యమంతో పాటు పరిశోధనాత్మక ఉద్యమం కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ సంపాదకులు సతీష్ చందర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక అంశాలను విడదీయలేని నేటి సమాజంలో కుల నిర్మూలన ఎలా జరుగుతుందో ఆచరణాత్మకంగా చూపె ట్టిన మహానీయుడని కొనియాడారు.

ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ మన దేశ నిర్థిష్ఠ పరిస్థితులకు అనుగుణంగా సైద్దాంతిక అంశాలను చాలా లోతుగా పరిశీలించి భారతీయ మార్కిస్ట్ తత్వవేత్తగా నిలిచాడని అన్నారు. విప్లవోద్యమంలో అరుదైన కమ్యూనిస్టు డివి కృష్ణ అన్నారు. ముందుగా డివి కృష్ణ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. డివి కృష్ణ వ్యాస సంకలనం నిరంతర అన్వేషకుడు పుస్తకం తో పాటు పాటల సిడిని సభలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి, రాయల చంద్రశేఖర్, కె.రమ, వి.కృష్ణ, చండ్ర అరుణ, వి. ప్రభాకర్, హన్మేశ్, ఎస్‌ఎల్ పద్మ, ప్రదీప్, డివి కృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News