Friday, December 20, 2024

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

బరంపూర్ : ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న బృందంలోని 12 మంది బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఒడిషాలోని గంజామ్ జిల్లాలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బరంపురం తప్తపని మార్గంలో దిగపహనంది వద్ద ఓ ప్రైవేటు బస్సు వచ్చి ఈ పెళ్లి బృందం బస్సుతో ఢీకొంది. ఈ ఘటనలో పెళ్లి వేడుకనుంచి వస్తున్న వారిలో 12 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారని సోమవారం బరంపురం జిల్లా ఎస్‌పి సరవానా వివేక్ ఎం తెలిపారు.

బరంపూర్‌లో జరిగిన పెళ్లికి హాజరై వీరు తిరిగి తమ గ్రామం ఖందడడెయులి వెళ్లుతుండగా వీరిని మృత్యువు కబళించింది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని మోడీ , ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వేర్వేరుగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దుర్మరణం చెందిన 12 మందిలో 11 మంది మాజీ ఎంపి రేణుబాల ప్రధాన్ సమీపబంధువులే. దుర్ఘటన గురిచి తెలియగానే మాజీ ఎంపి ఘటనా స్థలికి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News