Monday, January 20, 2025

విభిన్నమైన సరికొత్త థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా ‘సర్కిల్‘. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ “నా సినిమాల్లో నాయిక పాత్రలకు మంచి ప్రాధాన్యత ఇస్తాను. ఈ చిత్రంలోనూ ఆ ప్రయత్నాన్ని కొనసాగించాను. ఈ సినిమాలో అరుంధతి పాత్రలో రిచా పనై కనిపిస్తుంది.

అలాగే అశ్రిణ్ రాజసం మన పుట్టుకతో వస్తుందని చెప్పే పాత్ర చేసింది. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా నైనా కనిపిస్తుంది. సాయి రోనక్ తన కెరీర్ లో బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చాడు. బాబా భాస్కర్‌ది కీలక పాత్ర. ‘సర్కిల్’ థ్రిల్లర్ జానర్‌లో ఓ మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది”అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ “దర్శకుడు నీలకంఠతో పనిచేయడం గొప్ప అనుభవాన్నిచ్చింది. ఆయనతో వర్క్ చేయడం ఒక ఛాలెంజ్. నా యాంటీ హీరో బాబా భాస్కర్. నిజానికి ఈ చిత్రంలో నాతో పాటు తను కూడా ఒక హీరోనే”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శరత్ చంద్ర, బాబా భాస్కర్, రిచా పనై, అర్షిణ్ మెహతా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News