గంభీరావుపేట: బెడ్‌రూం ఇండ్ల కాలనీలో అన్ని వసతులు,సౌకర్యాలు కల్పించడానికి చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.సోమవారం మండల కేంద్రంలోని బీసి కాలనీలో 10కోట్ల56లక్షలతో నిర్మించిన 168,ఎస్‌సీ కాలనీలో 6కోట్ల 43లక్షలతో నిర్మించిన 104 డబుల్ బెడ్ రూంల ఇండ్లను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మించిన ఇండ్లను అందుబాటులోకి తీసుకువచ్చేల సిద్దం చేయాలని అన్నారు.విధ్యుత్,నీటి సదుపాయాల కల్పనపై ఆరా తీశారు.కాలనీలో ఇండ్ల వెంబడి మొక్కలు నాటాలని సూచించారు.పగిలిపోయిన కిటికీల అద్దాల స్థానంలో కొత్తవి అమర్చాలని,నల్లా కనెక్షన్,వీధి దీపాలు అమర్చాలని అన్నారు.లభ్దిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామ సభ నిర్వహించి మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని తహసిల్దార్‌ను ఆదేశించారు.
కాలనీలను శుభ్రం చేయాలని ఎంపీడిఒకు సూచించారు.కలెక్టర్ వెంట పంచాయితీ రాజ్ ఈఈ సూర్యప్రకాష్,టీఎస్‌ఈడబ్య్లూఐడీసి ఈఈ విరూపాక్ష,ప్యాకేజి 9ఈఈ శ్రీనివాస్ రెడ్డి,తహసిల్దార్ మధుసుధన్ రెడ్డి,ఎంపీడీఒ శ్రీనివాస్,ఏఈ భాస్కర్,తదితరులు ఉన్నారు.