యాదాద్రి భువనగిరి: చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు కేంద్ర హైండ్లూమ్, జౌలీ శాఖమంత్రి పియూష్ గోయెల్కు నివేదికలు పంపుతామని గుజరాత్ ఎంపి భారతిబెన్ ధీరుబాయి శ్రేయల్ అన్నారు. మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో చేనేత సమస్యలు తెలుసుకోవడం కోసం సోమవారం పోచంపల్లిని సందర్శిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయాప్రాంతాల చేనేత సహకార సంఘాల సభ్యులు, చేనేత కార్మక సంఘం నాయకులు, మాస్టర్‌వీవర్స్ ఆమెను కలిసి చేనేత పరిశ్రమ సమస్యలు తెలియజేసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర చేనేతసెల్ కన్వీనర్ ఎన్నం శివకుమార్, రాష్ట్రకిసాన్ మోర్చ అధికార ప్రతినిధి సుర్కంటి రంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్, చేనేతసెల్ కోకన్వినర్ మిరియాల వెంకన్న, వార్డు కౌన్సిలర్ సుర్కంటి జ్యోతి, జిల్లా కార్యదర్శి చింతల రామక్రిష్ణ, అధికార ప్రతినిధి కొంతం శంకర్, మండల,పట్టణ అధ్యక్షులు మేకల చొక్కరెడ్డి, దోర్నాల సత్యం, మహిళా మోర్చ బండిరాల సుశీల, నాయకులు ఏలె శ్రీనివాస్, రచ్చ శేఖర్, గంజి బస్వలింగం, రచ్చ సత్యనారాయణ, సీత లక్ష్మణ్, వంగూరి సిద్దూ, అంబదాసు, మెర్గు శశికళ, చితకింది రమేష్, తదితరులు పాల్గొన్నారు.