- Advertisement -
మంగలూరు : ప్రఖ్యాత యక్షగాన కళాకారుడు టోన్సే జయంత్ కుమార్ ఉడిపిలో సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 78 ఏళ్లు, ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. యక్షగాన వేషధారిగా ప్రఖ్యాతి చెందిన ఆయన తరువాత యక్షగాన గురువుగా కళారంగంలో విస్తృత సేవలందించారు. ఉడిపి యక్షగాన శిక్షణ ట్రస్ట్ గురువుగా మొదటి నుంచి దాని విజయానికి కృషి చేశారు. యక్షగాన అకాడమీ అవార్డు, శ్రీరామ విఠల అవార్డు, యక్షగాన కళారంగ అవార్డు తదితర అవార్డులు ఎన్నో సాధించారు. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మచే సత్కారం పొందారు.
- Advertisement -