Friday, November 15, 2024

నిరాశ్రయులకు ప్రిన్స్ విలియమ్ తోడు

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్ ప్రిన్స్ విలియమ్ తన తల్లి దివంగత డయానా ఆదర్శాలకు అనుగుణంగా నడువనున్నారు. దేశంలో ఇళ్లులేని నిరాశ్రయులకు ఆవాసం కల్పించే దిశలో ప్రధానమైన ఐదేళ్ల భారీ కార్యక్రమం చేపట్టారు. ప్రిన్స్ ఆఫ్‌వేల్స్ అయిన విలియమ్ ఇందుకోసం తమ సొంత ధార్మిక సంస్థ రాయల్ ఫౌండేషన్‌ను వినియోగించుకుంటారు. దీని ద్వారా నిరాశ్రయులకు ఇళ్లు కల్పించేందుకు 3 మిలియన్ పౌండ్లను వెచ్చిస్తారు.

ఇండ్లు లేని వారిని గుర్తించి ఆయా ప్రాంతాల వారిగా ఆశ్రయం కల్పించడం జరుగుతుందని విలియమ్ తరఫున ప్రకటన వెలువడింది. బ్రిటన్ సింహాసనానికి తరువాతి వారసుడు అయ్యే విలియమ్ ఈ ఔదార్య కార్యక్రమం పట్ల అంకితభావం ప్రకటించారు. తాను కేవలం 11 ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు తల్లితో కలిసి తొలిసారిగా ఒక నిరాశ్రయ పునరావాస కేంద్రానికి వెళ్లానని , ఈ సందర్భంగా తనకు ప్రగాఢమైన వీడని అనుభూతి తలెత్తిందని, ఇళ్లు లేక దీనావస్థలో ఉన్న వారికోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News