జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ
హైదరాబాద్ : విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యలు ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ అన్నారు. వినియోగదారులు , ప్రజలు కరెంటు సరఫరా చేసే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు , విద్యుత్ తీగలకు, విద్యుత్ పోల్స్ కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్ లైన్ల కింద ఉండొద్దని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలను ఈ నెల 26 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రెడ్ హిల్స్ లోని కెఎల్ ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో నేషనల్ ఎలక్రిసిటీ సేఫ్టీ వీక్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్ ఎస్ శ్రీనివాస్ రావు, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ వై.లింగా రెడ్డి, బిఐఎస్ సీనియర్ డైరెక్టర్ కె వి రావు హాజరుకాగా తెలంగాణ విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సునీల్ శర్మ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ లైన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సందర్బంగా టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ అంతరాలు లేకుండా చూస్తామన్నారు. విద్యుత్ సేఫ్టీ, ప్రమాద నివారణపై అందరికి బాధ్యతా ఉంటుందన్నారు.
ప్రజలకు, అలాగే విద్యుత్ లైన్ల పై విధులు నిర్వహించే సిబ్బందికీ ఈ విద్యుత్ ప్రమాద నివారణకు, అవేర్నెస్ కోసం ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్ ఎస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రమాదాలపై అవెర్ నెస్ కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు కాగా విద్యుత్ సమస్యలపై విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ సౌత్ సర్కిల్లో విద్యుత్ సరఫరాకు సంబందించిన సమస్యల కోసం ఈ కంట్రోల్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్ రూం నెంబర్ 9491628269. సర్కిల్లో డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.