Monday, December 23, 2024

వైద్య విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: వైద్య విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట డాక్టర్ బి నాగేందర్ సూచించారు. ఈ మేరకు సోమవారం జాన్సప్ అండ్ జాన్సన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొలైల్ స్కిల్ ల్యాబ్‌ను ఆయన ఆసుపత్రి వైద్యులు, వైద్య విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడానికి ఇలాంటి ల్యాబ్‌లు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. వైద్య విద్యార్థులు అత్యవసర, రోగి సంరక్షణ విధానాల్లో నూతన పద్దతుల పట్ల అవగహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యఖ్రమంలో ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ బి త్రివేణి, సివిల్ సర్జన్ ఆర్‌ఎంవో డాక్టర్ బి శేషాద్రిలతో పాటు ఆర్‌ఎంవోలు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News